రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఇసుకపట్ల సతీష్‌కుమార్‌పై బుధవారం రామచంద్రపురం పోలీసులు చీటింగ్, ఫోర్జరీ నేరాలపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఇసుకపట్ల సతీష్‌కుమార్ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలానికి చెందిన మామిడాల ఈశ్వర మాధవ కుమార్ మేనకోడలు, అతని అన్న కూతురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.7 లక్షల రూపాయలు తీసుకున్నాడు. దీనికి గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేరుతో ఫోర్జరీ లెటర్ హెడ్‌ను తయారు చేసి వారికి అందజేశాడు. దీనిపై మామిడాల ఈశ్వర మాధవ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.