ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట పట్టణ పోలీసులు బుధవారం మాటు వేసి ఆటోలో తరలిస్తున్న మద్యం క్వార్టర్ 180 ఎంఎల్ పరిమా ణంగల 500బాటిళ్లు పట్టుకున్నారు. యానాం నుంచి ఆటోలో సామర్లకోటకు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో సామర్లకోట పోలీసులు కాకినాడ రోడ్డులో నిఘాపెట్టి ఆటోలను తనిఖీలు చేయగా అక్రమ మద్యం తరలింపు బహిర్గతమైంది. ఆటో డ్రైవర్ పొన్నాడ వెంకట శ్రీని వాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ వద్ద నగదు రూ.40వేలను సామర్లకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్‌చేశారు. మద్యం అక్రమ రవాణాకు కారకులైన వారి కోసం తాళ్లరేవు కు చెందిన ఆటో డ్రైవర్ ఇచ్చి న సమాచారంతో గాలింపుచర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలి పారు. డ్రైవర్ వెంకట శ్రీనివాస రావును రిమాండ్ నిమిత్తం కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. కేసు సామర్లకోట పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.