ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు కలకలం రేగింది. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలియని నంబర్ నుంచి కాల్ రాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి చెప్పాడు. తిరిగి ఆ నంబర్‌కు చేయగా స్విచ్ఛాఫ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత విచారణలో UPలోని హాపూర్‌కి చెందిన జకీర్‌గా గుర్తించగా ఆ కాల్ బూటకమని తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.