చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు గ్రామంలో శనివారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం"లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే నమ్మకానికి నిలువెత్తు అర్థమని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజల హృదయాల్లో నమ్మకం సాధించారని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మాయ చేస్తూ అవినీతి పరిపాలన చేశారని, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుదారుడు, మోసగాడు, నయవంచకుడు, దోపిడిదారుడిగా ప్రజలు గుర్తించి చిత్తుచిత్తుగా ఓడించి 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువకులను మోసం చేస్తూ చివరి 4 నెలలు రూ. 2000/- నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది పోస్టులతో లక్షలాది ఉద్యోగాలు కల్పించి వారికి భరోసా కల్పించారని చెప్పారు. ఏ ప్రభుత్వంలో మోసం జరిగిందో. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో ప్రజలే నిర్ణయించాలని కోరారు. ప్రజలకు మంచి చేయాలని తపనతో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చావాల రవిబాబు, మండల పార్టీ కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, నాయకులు కందుల బుచ్చి రామయ్య, జంపాని నాగేశ్వరరావు, వేగినేడి సుబ్బారావు, శ్రీనివాసరావు, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ మరియు వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.