ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సుబ్బరాజు తెలిపారు. మంగళవారం కొలిమిగుండ్ల బెలుం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. అంగన్వాడీలోని 0-5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసి ఆధార్ కార్డులు అందించనున్నట్లు పేర్కొ న్నారు. మండల వ్యాప్తంగా 992 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయా సచివాలయాల్లో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆధార్ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa