వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏఒక్క కార్పొరేషనకూ నిధులు కేటాయించలేదని అనంతపురం జిల్లా, రొద్దం టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర విమర్శించారు. కంబాలపల్లిలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు వివరించారు. నాయకులు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలన లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషనలకు ఒక్కపైసా నిధులు ఇవ్వక నిర్వీర్యం చేశా రన్నారు. టీడీపీ హయాంలో అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి, నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వి ద్యార్థులకు ఉపకార వేతనాలు విరివిగా అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య ప్రజలు క ష్టాలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కులప్ప, రామాంజి, గోవిందు, నరేష్, అశ్వర్థప్ప, మూర్తి, వైస్ సర్పంచ అశ్వర్థప్ప, నరేంద్ర, నాగేష్, నారాయ ణ, శివప్ప, క్రిష్ణమూర్తి, శంకర్, సుబ్బరాయుడు, అంజినప్ప, బైలాంజి పాల్గొన్నారు.