ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29న ఒక్కరోజులోనే రూ.193.15 కోట్ల టోల్ చెల్లింపులు జరిగాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) వెల్లడించింది. 1.6 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయిందని తెలిపింది. కాగా, ఫిబ్రవరి 2021 లో కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన అనంతరం ఒక్కరోజులో ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి.