ఉగాండా దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా తన అంగరక్షకుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం కాల్చుకుని మృతి చెందాడు. మంగళవారం రోజు మంత్రి నివాసంలోనే అంగరక్షకుడు మంత్రిపై కాల్పులు జరిపాడు. గత కొంతకాలంగా వేతనాల విషయంలో వివాదం నడుస్తోందని, జీతం చెల్లించలేదనే కోపంతోనే మంత్రిని కాల్చిచంపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.