శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదిపై ఉన్న పురాతన వంతెన కూలిపోయింది. ఈ వంతెనను బ్రిటీష్ కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం రాళ్ల లోడుతో ఓ భారీ లారీ వెళ్తుండగా బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వంతెన కూలే సమయంలో నదిలో నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.