దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పట్పర్ గంజ్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. రోడ్డు కుంగిపోయిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతోనే అకస్మాత్తుగా కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.