సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. అమరావతి భూకుంభకోణంపై విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. గత ప్రభుత్వంపై విచారణ జరుపవద్దు అంటే ఎలా అని పేర్కొంది. ప్రాథమిక దశలోనే విచారణను అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను కొట్టేస్తూ జస్టిస్ ఎం.ఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.