భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2026లో ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేసి మళ్లీ మీ బిడ్డే ప్రారంభిస్తాడని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరు కుట్రలు చేసినా పనిచేయవన్నారు. మెడికల్, ఐటీ, ఇండస్ట్రీకి కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్టు మారుతుందన్నారు.