డిఎసిపి (డైనమిక్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్) పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 15,000 మంది వైద్యులు బుధవారం నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ డిమాండ్లను పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం అంగీకరించడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో వారు సమ్మెకు దిగారు.రాష్ట్రంలో అత్యవసర ఆరోగ్య సేవలను కూడా వైద్యులు నిలిపివేశారు.