దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 61,274 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 18,118 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు పెరిగి 81.67 వద్ద మొదలైంది. నిఫ్టీలో ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, భారత్ పెట్రోలియం, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.