నాసా నిర్వహించిన హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్-2023లో ఏపీ విద్యార్థులు అవార్డు సాధించారు. వీరికి ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (APNRTS) అభినందన కార్యక్రమం నిర్వహించింది. బుధవారం మంగళగిరిలోని సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గత నెలలో అమెరికాలోని స్పేస్ రాకెట్ సెంటర్‌లో జరిగిన పోటీల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. భారత్ నుంచి ఆరుగురు సభ్యులు పాల్గొనగా అందులో అక్షర, ఆకర్ష్‌లు ఏపీకి చెందిన విద్యార్థులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa