15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి వర్క్ బిల్లులను సంబం ధిత వెబ్ సైట్ లో ఆప్‌లోడ్ చేయాలని జెడ్పీ చైర్మ న్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్థానిక జెడ్పీ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయాల ఏఓ లతో జెడ్పీ చైర్మన్, సీఈఓ ప్రభాకర్‌రెడ్డి సమా వేశం నిర్వహించారు.
వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగుల ముఖ హాజరు వివరాలను రోజు ఉదయం 11 గంటలకు జెడ్పీ కార్యాలయానికి పంపాలన్నారు. త్వరలో ఎం. పీడీఓ కార్యాలయాలను తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించి రిజిష్టర్, రిపోర్టులను సిద్ధం చేసుకోవాలన్నారు. సకాలం లో కోర్టు కేసులకు హాజరు కావాలని తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాల కు ఏఓలే హాజరుకావాలని, కింద స్థాయి ఉద్యో గులను పంపకూడదని స్పష్టం చేశారు.