నేడు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను కర్నూలు జిల్లా పాన్యం నియోజక వర్గం బొల్లవరంలో నిర్వహిస్తున్నారు. ఆయనను గ్రామస్తులు కలిసి తమ సమస్యలను తెలియజేసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..... పోరాటాల పురిటగడ్డ బొల్లవరంలో పాదయాత్ర చెయ్యడం తన అదృష్టమని అన్నారు. ఉద్యమ వీరులకు జోహార్లు తెలిపారు. టీడీపీ అధికారలోకి వచ్చిన వెంటనే బొల్లవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందిస్తామని నారా లోకేష్ వెల్లడించారు.
![]() |
![]() |