అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ ఆపరేషన్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఉద్యోగులను తొలగించనుంది. దీంతో సుమారు 3,500 మంది ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నట్లు తెలుస్తోంది. ముందుగా నాన్ బిల్లింగ్, కార్పొరేట్ రోల్స్‌లో ఉన్నవారిని తొలగించే ప్రక్రియలో కంపెనీ ఉంది. ఖర్చుల నియంత్రణలో భాగంగా ఆఫీసు స్పేస్‌ను కూడా తగ్గించుకోనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది ఆదాయం పడిపోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.