ప్రపంచంలోనే రష్యా శక్తివంతమైన దేశం. ఆ దేశ అధ్యక్షుడికి భద్రతపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరంలేదు. కానీ అధ్యక్షుడిని చంపేందుకు శత్రువులు ఏకంగా ఆరుసార్లు దాడికి యత్నించారు. ఈ దాడుల నుంచి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే పుతిన్‌పై తొలిసారి 2002లో హత్యాయత్నం జరగగా, తాజాగా బుధవారం మరోసారి పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రెండు డ్రోన్లతో దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది.