గోరక్షకుల అత్యుత్సాహంతో లారీ డ్రైవర్ కు తీవ్ర నష్టం వాటిల్లిన ఘటన హర్యాణాలో జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఓ ట్రక్కులో ఆవులను రవాణా చేస్తున్నారనే అనుమానంతో గోసంరక్షకులు స్పైక్ స్ట్రిప్స్ సాయంతో ట్రక్కు టైర్లను పంక్చర్ చేశారు. అయితే ఆ ట్రక్కులో దుస్తులను రవాణా చేస్తున్నట్లు కనుగొన్నారు. కాగా, ట్రక్కు రన్నింగ్ లో ఉన్నప్పుడు టైర్లను పంక్చర్ చేయడంతో భారీ నష్టం వాటిల్లిందని డ్రైవర్ వాపోయాడు.