సోషల్ మీడియా వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల్లో మహిళా పోలీసులకు ప్రోటోకాల్ ఉండాలన్నారు. దిశ యాప్ ప్రతి ఇంట్లో వాడుతున్నారా? లేదా? అనే అంశంపై మరోసారి పరిశీలించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దిశ పోలీస్స్టేషన్ ఉండాలని సీఎం ఆదేశించారు.