ఏపీ ప్రభుత్వం నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని విడుదల చేయనుంది. సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి 12,132 మంది ఖాతాల్లో రూ.87.32 కోట్లు జమ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ. లక్ష, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు, కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.40 వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు రూ.75 వేలు, దివ్యాంగులకు రూ. 1.5 లక్షల చొప్పున వధులు తల్లి ఖాతాల్లో జమ చేయనున్నారు.