నేడు రాత్రి 8.45 గంటల నుండి తెల్లవారుజామున 1.02 గంటల వరకు చంద్రగహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం చాలా అరుదైనదని, 19 ఏళ్లకు ఒకసారి వస్తుందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రుడు ఎరుపురంగులో కాకుండా చీకట్లో ఉన్నట్లు కనిపిస్తాడని, దీనిని పెనుంబ్రాల్ చంద్రగ్రహణం అంటారని పేర్కొన్నారు. అయితే ఈ చంద్రగ్రహణం భారత్ లో కనిపించదని, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అట్లాంటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుందని తెలిపారు.