కర్ణాటకలో అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ ఇవ్వడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాగా, ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల ముందు హనుమాన్ చాలీసా పఠించాలని తమ పార్టీ శ్రేణులకు బీజేపీ సూచించింది.