పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బజారు వీధిలో వెలసిన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పార్వతి పరమేశ్వరులు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధులలో ప్రజలు కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమానికి ఉభయదారులుగా బ్రాహ్మణ కులస్తులు వ్యవహరించారు.