ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొహంగంజ్ గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఇంట్లో ఉన్న వస్తువులు కాలిబూడిదవ్వడంతో కుటుంబం రోడ్డున పడింది. అయితే, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటికి నిప్పింటించాడని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.