అకాల వర్షాల కారణంగా రైతుల రెక్కల కష్టం వర్షార్పణమైంది. మండు వేసవిలో ఊహించని రీతిలో గత కొన్ని రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలు రైతులను తేరుకోకుండా చేస్తున్నాయి. మొక్కజొన్న, జొన్న, మిర్చి తదితర దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు వీడని వర్షాలతో వమ్మయ్యాయి. ప్రభుత్వం ఈపాటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే మొక్కజొన్న విక్రయించి నష్టం నుంచి బయటపడి ఉండేవారని, అయితే ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. ధర పతనంతోపాటు, వర్షాలు ముంచేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం మొద్దునిద్ర వీడటంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.