కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ ప్రత్యేక వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలప్పుజలోని చెరువల్లి మసీదులో ఓ హిందూ వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల నడుమ వధువు అంజూ, వరుడు శరత్‌ల పెళ్లి జరిగింది. మసీదు నిర్వాహకులు వధువుకు బంగారం పెట్టి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు.1000 మందికి విందు భోజనాలు పెట్టించారు. వధువు తల్లి తన కుమార్తెకు పెళ్లికి సాయం చేయాలని మసీదు నిర్వాహకులను కోరటంతో వారు మసీదులోనే ఘనంగా వివాహం జరిపించారు.