పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్టవుతుంది. వీరి ఖాతాల్లో వైయస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.