-ప్యాకేజీ పచ్చి మోసం అని అందులో పెట్టినవన్నీ పునర్వవస్థీకరణ చట్టంలో ఉన్నవే
-నేడు హోదా సంజీవని కాదు
-బాబుపై రఘువీరారెడ్డి విమర్శ
విజయవాడ, మేజర్‌న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలకు అంతేలేదని 1000 రోజుల పాలనలో నేటికి 1000 వంచనలకు ప్రజలకు గురయ్యారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టవిభజనకు అనుకూలంగా రెండు ఉత్తరాలు రాసిన బాబు కాంగ్రెస్‌పై ఆబద్దాపు ప్రచారం చేస్తూ ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వంచన చేసే విధంగా మట్లాడుతూన్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారంనాడొక ప్రకటనను విడుదలచేశారు. ఏపి అభివృద్దికి ప్రత్యేక హోదా ఐదు ఏళ్లు సరిపొదని 15 సంవత్సరాలు కావాలని కోరిన చంద్ర బాబు, నేడు హోదా సంజీవని కాదని 5 కోట్ల ఆంధ్రులను వంచన చేశాడన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందేనని గత రాష్ర్ట అసెంబ్లీ లో రెండుసార్లు తీర్మానం ప్రవేశపెట్టి ఇప్పుడు హోదా అవసరం లేదని చేబుతూ ఏపి ప్రజలకు ద్రోహం చేశారన్నారు. ప్యాకేజీ పచ్చి మోసమని అందులో పెట్టినవన్నీ పునర్వవస్థీకరణ చట్టంలో వున్నవేనన్నారు. విభజన చట్టంలో వున్న అంశాలను కొన్నింటిని ప్యాకేజీలో పెట్టలేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజీకి సంబంధించి హోదా, పునర్వవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాల అమలు అంశం రాష్ట్రాభివృద్ధికి అత్యంత ప్రధానమైనవి అని గుర్తుచేశారు. లేని ప్యాకేజితో చట్టబద్దత అంటూ మరో సారి ఏపి ప్రజలను వంచన చేసేందుకు నాటకాలు అడుతున్నారన్నారు. టిడిపి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సుమారు 600లపై చిలుకు హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా రాష్ర్ట ప్రజలను టిడిపి వంచన చేసిందన్నారు.
రైతు రుణాలన్నింటిని బేషరతుగా మాఫి, డ్వాక్రా గ్రూపులకు పూర్తిగా రుణమాఫిచేసి వారు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపిస్తామన్న టిడిపి హామీ అమలు కాలేదన్నారు. బెల్టు షాపుల రద్దు, మద్యం నియంత్రణ హామీ నిచ్చి వాటిని విస్మరించారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నెలకు 2వేల నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగమని చెప్పి వాటిని గాలికొద్దిలేశారని విమర్శించారు. బీసీలకు 10వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి, బిసి సబ్‌ప్లాన్ అమలు చేస్తామని విస్మరించారన్నారు. రాష్ర్టంలో ప్రతి బిసి కులానికి విడివిడిగా 65 హామీలు ఇచ్చి వాటిని అమలుచేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ 100 శాతం అమలన్నారు. అతిక్రమించిన వారిపై చర్యలన్నారు వాటిని అమలు చేసిందెక్కడా అని ప్రశ్నించారు. రాష్ర్టంలో మెజారిటీ మండలాల్లో గత ఏడాదికి మించి ఈ ఏడాది కరువు పరిస్థితులు తలెత్తాయన్నారు. కేంద్రం ఇప్పటివరకు చేసిన సాయం, రాష్ర్ట ఆర్ధిక పరిస్థితులు, అప్పులు, రాజధాని నిర్మాణ ఒప్పందాలు, వాస్తవాలపై శ్వేతప్త్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa