-1,500 మంది పోలీసులతో ఏర్పాట్లు
-అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు
-ఆరు రూట్లలో పోలీసుల పహారా
-రక్షణ కోసం ఐదు చెక్‌పోస్టులు
-గవర్నర్ గౌరవ భద్రతా దళం ్టయ్రల్ రన్
అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి అమరావతి వేదికగా అసెంబ్లీ సమావేశాలు జరుగబోతుండడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు. ఐజీ ఎన్.సంజయ్ పర్యవేక్షణలో అర్బన్, రూరల్ ఎస్పీలు త్రిపాఠీ, నారాయణ్ నాయక్‌లు ఎవరి పరిధిలో వారు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. అసెంబ్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సుమారు 700 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వీఐపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువగా కరకట్ట రోడ్డు ద్వారా రానున్న నేపథ్యంలో ఆ రోడ్డులో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కరకట్ట రోడ్డు, అలాగే ఉండవల్లి గుహలు, పెనుమాక, మంగళగిరి డాన్‌బాస్కో, ఎరబ్రాలెం, కౄఎష్ణాయపాలెం రోడ్డు, అదేవిధంగా మంగళగిరి పాత బస్టాండ్, నిడమర్రు, కురగల్లు రోడ్డు, అలాగే గుంటూరు, లాం, తాడికొండ, పెదపరిమి రోడ్డుతో పాటు కంతేరు, తాడికొండ, పెదపరిమి రోడ్డు, కంతేరు, నిడమర్రు, కురగల్లురోడ్లలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటెలిజెన్‌స వర్గాల నుంచి కూడా బందోబస్తుకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. సీఎం, గవర్నర్ సహా హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలను దౄఎష్టిలో ఉంచుకొని ఆయా రూట్లలో బాంబ్, డాగ్ స్కా్వడ్ బౄఎందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఏఎన్‌ఎస్, క్విక్ రెస్పాన్‌స బౄఎందాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా బౄఎందాలకు వీహెచ్‌ఎఫ్ సెట్‌లను అందించారు. అధికారులు, రూట్ ఆఫీసర్లు, మొబైల్ పార్టీలు, ఎఎన్‌ఎస్, క్యూఆర్ టీమ్ బృందాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే రూట్‌లలో అర్బన్ ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కరకట్టలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద, ప్రకాశం బ్యారేజి వద్ద, ఉండవల్లి స్క్రూబ్రిడ్జి వద్ద, తాడికొండ అడ్డరోడ్డు వద్ద, మంగళగిరి డాన్ బాస్కో వద్ద ఆయా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదుగురు అదనపు ఎస్పీల్లో ఇరువురు ఇతర జిల్లాల నుంచి రప్పించారు. అలాగే 20 మంది డీఎస్పీలు, 41 మంది సీఐలు, 123 మంది ఎస్‌ఐలు, మరో 550 మంది సిబ్బందిని కూడా ఆయా రూట్‌లలో నియమించారు.
సమావేశాలకు అనుమతి తప్పనిసరి
అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యంత్రాంగం అసెంబ్లీ ప్రాంగణాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అనుమతి లేకుండా ఏ ఒక్కరికి లోనికి ప్రవేశం ఉండదు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించేందుకు ఐదు గేట్లు ఏర్పాటు చేశారు. ఆవరణలోకి వెళ్లిన వారు అసెంబ్లీలోకి వెళ్లటానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. శనివారం గుంటూరులో ఐజీ ఎన్.సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్‌లు ఆయా వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నెల 6న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, పరిసర ప్రాంతాలతో పాటు ఆవరణలోనూ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంటారని ఐజీ ఎన్.సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు.
ఐదు ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం
అసెంబ్లీ భవనానికి ఎదురుగా పార్కింగ్ కోసం ఐదు ఎకరాలను కేటాయించారు. రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ ప్రత్యేకంగా అధికారులతో చర్చించి ఐదు ఎకరాలను పార్కింగ్ కోసం తీసుకున్నారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా, అధికారులు, సందర్శకులకు సంబంధించి ఎవరికి వారికి వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. అక్కడ సెక్యూరిటీ కంట్రోల్ డెస్‌కలను ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోబస్తు మధ్య గవర్నర్
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ప్రసంగించేందుకు వస్తున్న గవర్నర్‌ను పటిష్ట బందోబస్తు మధ్య అసెంబ్లీకి తోడ్కొని వచ్చేందుకు పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. గవర్నర్ వెంట ఉండే ఆ దళం విజయవాడ నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ వరకు ట్రైల్ నిర్వహించింది. మంచినీరు, తేనీరు ఇచ్చేందుకు రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 300 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. గవర్నర్ ఒక రోజు ముందే విజయవాడకు చేరుకున్నారు. ఇక్కడ బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి చేరుకొని ప్రసంగిస్తారు. గవర్నర్ పర్యటన మొత్తం పూర్తయ్యేంతవరకు కాన్వాయ్‌ని ఏర్పాటు చేయాల్సిందిగా అర్బన ఎస్పీ త్రిపాఠిని కలెక్టర్ ఆదేశించారు. కార్డియాలజిస్టు, ఇద్దరు ఓ-పాజిటివ్ రక్తదాతలను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. తాగునీటిని పరీక్షించేందుకు వాటర్ ఎనలిస్టుని డిప్యుటేషన్ చేయాలని మెడికల్ కళాశాల సివిల్ సర్జన్(బ్యాక్టీరియాలజిస్టు)ని ఆదేశించారు. ఆహారం ఇతర పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు గెజిటెడ్ ఫుడ్ ఇనస్పెక్టర్‌ని పంపించాలని, కాన్వాయ్‌లో ఫైర్‌టెండర్‌ని అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. గవర్నర్ పర్యటన పూర్తయ్యేంత వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకుండా చూడాల్సిందిగా ఏపీఎస్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. గవర్నర్‌కి లైజాన్ ఆఫీసర్‌గా గుంటూరు ఆర్డీవోని నియమించారు. గవర్నర్‌కు ప్రోటోకాల్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. కాన్వాయ్ వాహనాలను సమకూర్చే బాధ్యతను డీటీసీకి కేటాయించారు.
సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత
శాసనసభ సమావేశాలకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్‌స హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన శాసనసభ సమావేశాల భద్రతా చర్యలను వివరించారు. అమరావతిలో తొలిసారిగా జరగనున్న సమావేశాల ప్రారంభోత్సవం నాడు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ అధ్యక్షులు, శాసన మండలి అధ్యక్షులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరవుతున్నందున పోలీసు ఆంక్షలు కొద్దిగా కఠినంగానే ఉంటాయన్నారు. మరుసటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎంత వరకు భద్రతా చర్యలు అవసరమో ఆ మేరకు అమలు చేస్తామన్నారు. 6వ తేది ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. వెలగపూడిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు లోపలకు ప్రవేశించటానికి ఐదు దారులు, తొమ్మిది ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గేటు-1 ద్వారా ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు ప్రవేశిస్తారన్నారు. గేట్-2 ద్వారా మంత్రులు, ప్రతిపక్షనేతలు, గేట్-3 ద్వారా ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు, కార్యాలయ అధికారులు, గేట్-4 ద్వారా శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, గేట్-5 ద్వారా బయటకు రాకపోకలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాసనసభ సిబ్బందికి కేటాయించినట్లు తెలిపారు. ప్రవేశద్వారం-1 ద్వారా ముఖ్యమంత్రి, 2 ద్వారా డిప్యూటీ సీఎం, అధికారుల వేచిఉండే గదికి మార్గమన్నారు. 3 ద్వారా శాసనమండలి సభ్యులు, 4వ ద్వారం నుంచి శాసనమండలి ఛైర్మన్, సభ్యులు, 5వ ద్వారం నుంచి కౌన్సిల్ సభ్యులు, శాసనసభ సిబ్బంది, 6వ ద్వారం శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, 7వ ద్వారం నుంచి పాస్‌లు ఉన్నవాళ్లు వీఐపీ గ్యాలరీలోకి వెళ్లడానికి, 8వ ద్వారం మంత్రులు, ప్రతిపక్షనాయకులు, శాసనసభ సభ్యులు, 9వ ద్వారం మీడియా గ్యాలరీలకు ప్రవేశం ఉంటుందన్నారు. పార్కింగ్ కీలకంగా మారడంతో రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఐదు ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. శాసనసభ భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు భద్రతా డెస్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
300 మంది గ్రామ సేవకులు
శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి పాస్‌లు కలిగి ఉండాలన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని అవిలేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు పంపించమన్నారు. శాసనసభ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు అక్కడికి వచ్చే వారికి టీ, కాఫీ అందించటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 మంది సేవకులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇతరులు అక్కడ ఎటువంటి విక్రయాలు చేయకుండా నిరుద్యోగులను ఎంపిక చేసి ద్విచక్రవాహనంపై తిరుగుతూ నిర్ణీత రుసుముకు అక్కడివారికి తేనీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభోత్సవానికి హాజరయ్యే వారికి మంగళగిరి నుంచి వచ్చే మార్గాలను తెలియజేస్తూ సూచీ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa