-అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటున్న వైసీపీ
-నేడు వైసీపీ ఎల్‌పీ సమావేశం?
-భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-మండలి వేదికగా ఏపీ కాంగ్రెస్ పోరుకు సిద్ధం
-రఘువీరారెడ్డితో భేటీ అయిన సి.రామచంద్రయ్య
-రాష్ట్రంలోని సమస్యలపై నిలదీతకు యోచన?"
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావే శాల్లో సమరానికి సన్నద్దమవుతున్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలోని సమస్యలు, లోపాలతోపాటు ఈ సర్కార్ అవినీతిపై, ఏపీకి ప్రత్యేక హోదా అం శంపై నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ తొలి సమా వేశం ముగిశాక సోమవారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో శాసనసభలో చర్చించాల్సిన అంశాలపైనా, ప్రభుత్వ హామీలఅమలు తదితర వాటిపైనా సుధీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను వైసీపీ రూపొందించుకోనున్నది. మరోవైపు శాసన మండలియే ఏకైక ఆధారంగా ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ సైతం టిడిపి సర్కార్‌పై పోరాటం సాగించాలని యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీని విడి టిడిపిలోకి వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాసనమండలి లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. శాసనసభలో కాం గ్రెస్ పార్టీకి స్థానం లభించకపోవడంతో ఇక శాసనమండలియే ఏకైక వేదికగా ఏపీ కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది. శాసనమండలిలో ఏఏ అంశాలపై చర్చ చేపట్టా లి, ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత, టిడిపి హామీల అమలు వంటి వాటిపై సుధీర్ఘంగా శాసన మండలిలో లేవనెత్తాలని ఏపీ కాం గ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ విషయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డితో ఏపీ శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య చర్చలు సాగించినట్లు సమాచారం. మండలి వేదికగానే ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.
జే.సీ. ట్రావెల్‌స ఘటన...ప్రత్యేకహోదా...కేంద్ర హామీల ప్రస్తావన? : ఇటీవల కృష్ణజిల్లాలో జే.సీ.ట్రావెల్‌స వ్యవహారంలో అధికార టిడిపి ప్రధాన ప్రతిప క్షమైన వైసీపీ సవాల్ ప్రతిసవాల్‌కుదిగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రావెల్‌స యజమానులైన జే.సీ. బ్రదర్‌స టిడిపిలో ఒక్కరు ఎంపీగా, ఒక్కరు ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ వ్యవహరానికి రాజకీయ రంగు పులుముకొంది. సరిగ్గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ఈ వ్యవహారం జరగడంతో వీటిని తమ కు అనుకూలంగా మల్చుకొనేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సన్నద్దమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని టిడిపి సర్కార్ కాపాడుతోందన్న ప్రధాన ఆరోపణతో ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ వ్యవహారంపై సభలో ప్రత్యేక చర్చసాగే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా వైసీపీ భావిస్తోంది. దీంతో పాటు టిడిపి ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీల అమలుతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా అంశం, ప్రత్యే క ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత, విశాఖ రైల్వేజోన్ వ్యవహారం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
సభా సమయాన్ని పూర్తిగా వినియోగించుకొందాం?
గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అధికార పక్షం కాలుదువ్వడం ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో స్పందించడంతో ప్రజా సమ స్యలు, ఇతర అంశాలపై సమర్థవంతమైన చర్చ సాగలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు కీలకం కాబట్టి అసలు చర్చా ఉద్దేశం పక్కదోవపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. అధికార టిడిపి కవ్వింపు చర్యలకు ప్రభావితం కాకుండా తాము అనుకొన్న లక్ష్యాన్ని అసెంబ్లీలో చర్చ సందర్భంగా చేరుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. సభలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్న దానిపై సోమవారంనాడు జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశంలో చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa