ఉమ్మడి అనంత జిల్లా జెడ్పీ సమావేశంలో అధికార పార్టీ జెడ్పీటీసీలు నిరసనలకు దిగారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఎదురుగానే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తాము జెడ్పీటీసీలుగా ఎందుకు ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. నాబార్డ్ నిధులు ఎక్కడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 15 ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. జెడ్పీ నిధులపై చైర్ పర్సన్ బోయ గిరిజమ్మను జెడ్పీటీసీలు నిలదీశారు. ఏ ఒక్క మండలానికి జెడ్పీ నుంచి నిధులు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మాకు నిధులు ఇవ్వరు..అధికారాలు ఇవ్వరు. మా మండలాల్లో కనీసం ఒక్క పని కూడా చేయలేకపోతున్నాం’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపి బయటకు వచ్చేశారు. అంతా అధికార పార్టీ నేతలే అయినప్పటికీ సమావేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ సమావేశానికి మంత్రి ఉషశ్రీ చరణ్ మినహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకాని పరిస్థితి.