ఏలూరు జిల్లాలో అధిక ఫలసాయం ఇచ్చే నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలను రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయిల్‌పామ్ పంట ప్రగతి, మొక్కల పంపిణీ, పెంపకం అంశాలపై ఉద్యానవన అధికారులు, కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. రైతులకు స్వదేశీ, దిగుమతి చేసుకున్న ఆయిల్‌పామ్ సీడు మొక్కలను సొంత ఖర్చుతో పెంచి హెక్టారుకు 143 మొక్కలు చొప్పున పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్, ఏపీ ఆయిల్‌ఫెడ్, గ్రోద్రేజ్ ఆగ్రోవెట్, పతంజలి ఫుడ్స్, నవభారత్ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.