ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియెన్నా వీర్(23) మరణించారు. గుర్రపు స్వారీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా, సియెన్నా తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 2న గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa