ప్రధాని మోడీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం మండిపడ్డారు. ఓ వైపు కాశ్మీర్‌లో ఐదుగురు జవాన్లను ఉగ్రవాదులు హతమార్చారని, మరో వైపు మణిపూర్‌లో హింస చెలరేగుతోందని అన్నారు. కానీ ప్రధాని మాత్రం కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ, 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రమోట్ చేయడంలోనూ బిజీగా ఉన్నారని విమర్శించారు. ఓ ఫిక్షన్ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం విచారకరమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa