ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ డ్రోన్ కలకలం రేపింది. ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో సైన్యం అప్రమత్తమైంది. వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆ డ్రోన్‌ను కూల్చేశారు. అయితే తమ శత్రువులే ఈ డ్రోన్‌ను ప్రయోగించారని ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంద్రేయ్ యెర్మాక్ ఆరోపించారు. డ్రోన్‌ను గాలిలో ఉండగానే కూల్చేశామని ప్రకటించారు. కాగా ఆ తర్వాత కూల్చేసిన ఆ డ్రోన్ తమదేనని యెర్మాక్ గుర్తించారు.