యువతను గంజాయి బారి నుండి రక్షించాలని. గంజాయిపై వైసీపీ ప్రభుత్వం, ఎస్ఈబి పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ప్రదర్శిస్తూ టీడీపీ కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నసీర్ అహ్మద్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.