జగనన్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం పనులు వేగాన్ని పెంచాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. నరసరావుపేట అర్బన్ పరిధిలో ఉన్న ఇక్కుర్తి అర్బన్ హౌసింగ్ లేఔట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జగనన్న కాలనీల్లో జరుగుతున్న నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లేఔట్ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.