10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన బాలబాలికులకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యున్నత ర్యాంకు సాధించడం పట్ల ఎంపీ మోపిదేవి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసిన విద్యా విధానం ద్వారా విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారని ఆయన తెలిపారు.