వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం క్రాప, కొల్లూరు, జువ్వలపాలెం, కిష్కిందపాలెం గ్రామాలు, భట్టిప్రోలు మండలంలో వెల్లటూరు, పెదలంక, పెసర్లంక, చింతమోటు గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పరిశీలించి, నష్టపోయిన రైతులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, జొన్న, పసుపు, మిరప పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి అన్నారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు పంట నష్టం గురించి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు, తాము నానా యాతనాలు పడి పంటలు పండిస్తే అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని కనీసం అధికారులు తమ వంక కనెత్తి చూడలేదని, ఇలా అయితే తాము బ్రతకలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులను పరామర్శించే వ్యక్తులు లేకుండా పోయారని. అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని రైతుల వంక చూసిన పాపాన పోలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు పంట నష్టంపై స్పందిస్తే గాని ప్రభుత్వంలో చలనం రాలేదని అన్నారు. గత నాలుగు ఏళ్ల నుంచి పంట చేతికి వచ్చే సమయానికి వర్షం వల్ల రైతాంగం తీవ్రగా నష్టపోతున్నారు అన్నారు. రైతుల పంట నష్టం విషయంలో ప్రభుత్వం తపించుకోవటాని కుంటిసాకులు చెబుతూ ఎన్ని దారులు ఉన్నాయో అన్ని వెతుకుతున్నారు అంటున్నారు. ప్రతి ప్రాంతాల్లో అన్ని రకాల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. రైతుకి ఎకరానికి 40వేలు పెట్టుబడి ఖర్చు అయ్యింది అని పంటలు తడిచి వాసన వస్తుంది రోగాలు కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది అన్నారు. పంటలు కొయ్యనివి వాటికి కూడా 50శాతం నష్టం వాటిల్లింన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నారు. లంక ప్రాంతంలో పంటలు ఇంకా నీళ్ళలో తేలుతుంది అన్నారు. మొక్కజొన్న మొదట 1962 రూపాయల ధర ఉంటే ఇప్పుడు 1600 రూపాయలకు కూడా కొనే దిక్కు లేదుఅన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ ఉందో ఆ నిధి ప్రభుత్వం చెప్పాలి అన్నారు. మొక్కజొన్న 50వేల ఎకరాలు, జొన్న 15, 20వేల ఎకరాలు జొన్న ఉన్నది అని అన్నారు. పసుపు, కంద, తదితర పంటలు వేశారు. వర్షానికి తడిచిన, మొక్కవచ్చిన, రంగు మారిన ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయలని అన్నారు. రైతుల దగ్గర పంటలు కొనకుండా కుంటి సాకులు చెబితే రైతులతో కలిసి రోడ్డు ఎక్కి కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, కౌలు రైతులు, ప్రజలు వున్నారు.