ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాణాలను బలి పెడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2023, 10:08 PM

వైసీపీ నేతలు, ఇసుక బకాసరుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాణాలను అధికారులు బలి పెడుతున్నారని ఏపీ బీజేపీ నేతలు ఱరోపించారు. ఇదిలావుంటే వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 19వ తేదీన కొట్టుకు పోయిందని బీజేపీ గుర్తు చేసింది. ఇసుక మాఫియా కారణంగా అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నీటి ప్రవాహనంలో పడి కనీసం 33 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, ఇసుక బకాసరుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాణాలను అధికారులు బలి పెడుతున్నారన్నారు. దీనికి సంబంధించి బాధ్యులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com