పెదకాకాని గ్రామం గౌడ పాలెం కు చెందిన హరిబాబు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే డ్యూటీ కి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్య సమీప బందువు ఇంట్లో నిద్రించి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూచేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల బీరువా పగలగొట్టి 70వేల నగదు 9 శవర్ల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు పెదకాకాని సీఐ బండారు సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.