ప్రతి బుధవారం విశాఖపట్టణం నుంచి గుంటూరు మీదగా సికింద్రాబాద్ కు వెళ్లే ప్రత్యేక రైలు వేళల్లో రైల్వేశాఖ స్వల్ప మార్పులు చేసింది. ఈ రైలు గతంలో రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ మీదగా గుంటూరుకు చేరుకొనేది. ఈ నెల, జూన్లో నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ మీదగా దారి మళ్లించినందున గుంటూరు కు గురువారం వేకువజామున 3. 18కి వచ్చి 3. 20కి బయలుదేరుతుంది. సత్తెనపల్లికి వేకువజామున 4 గంటలకు, సికింద్రాబాద్ కు ఉదయం 9. 05కి చేరుతుంది. అలానే సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం రాత్రి 7. 40కి బయలుదేరి సికింద్రాబాద్ -విశాఖపట్టణం ప్రత్యేక రైలు రాత్రి 11. 45 కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 9. 15కి విశాఖపట్టణం చేరుకొంటుంది