ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉచిత మోడల్ లాసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు కృష్ణ శనివారం తెలిపారు. గుంటూరుతో పాటు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ పరీక్షను మే 14వ తేదీ ఉదయం 10 నుంచి 11. 30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. లాసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మోడల్ పరీక్షను ఉపయోగించుకోవాలని సూచించారు.