రైలు నెంబర్ నెం. 12805 విశాఖపట్టణం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ కోటాని రైల్వేశాఖ సవరించింది. ఈ రైలుకు గుంటూరు రిమోట్ లొకేషన్ కోటా కింద ఏసీ చైర్ కార్ కి ఆరు సీట్లు ఉండగా ఆగస్టు 23 నుంచి 21 ఏసీ సీట్లకు పెరగనున్నాయి. అలానే సెకండ్ సిట్టింగ్ కోటా 200 నుంచి 451కి పెరగనున్నది. దీంతో లింగంపల్లి వైపునకు సమృద్ధిగా ఏసీ చైర్ కార్ సెకండ్ సిట్టింగ్ సీట్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.