సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన చేస్తున్నారని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. పామర్రులో రూ. 34 లక్షలతో నిర్మించిన మూడు సిమెంటు రోడ్లను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం తాగునీటి సరఫరాకు పంచాయతీ నిధులు రూ. 3 లక్షలతో సమ కూర్చిన మరో వాటర్ ట్యాంకర్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులు రూ. 25 లక్షలతో స్థానిక విష్ణాలయం వద్ద నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి కొత్త పేట వద్ద రహదారి ఏర్పాటుకు రూ. 4 లక్షలు, ఎన్. నాగిరెడ్డి ఇంటి వద్ద రూ. 5 లక్షలతో సీసీ రహదార్లు నిర్మించామన్నారు.
గ్రామాల్లో పాడైన అంతర్గత రహదార్లను అభివృద్ధి పర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ ఉప సర్పంచ్ దేవిరెడ్డి బాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు దొంతిరెడ్డి శ్రీరామిరెడ్డి, వైస్ ఎంపీపీ ఆరుమళ్ల రమాదేవి, సర్పంచ్ కేతావతు కస్తూరి, ఎస్సీ సెల్ నాయకులు మద్దుల సుబ్రమ ణ్యం, తహసీల్దార్ వీవీ భరత్ రెడ్డి, ఎంపీడీవో వై. రామకృష్ణ, పీఆర్ డీఈ శ్రీనివాస్, పీఆర్ ఏఈ ధర్మయ్య, పంచాయతీ ఈవో అబ్దుల్ సలీం, వార్డు మెంబర్లు కూసం సుబ్బారెడ్డి, నందిపాటి కనకదుర్గ, ఎన్ శ్రీలక్ష్మీ, పార్టీ నాయకులు కొచ్చెర్ల శ్రీనివాస రావు, డీడీ ప్రసాద్, కె. రాణి, కూసం పెద వెం కటరెడ్డి, నవుడు సింహాచలం, నందిపాటి సాంబి రెడ్డి, బొంతు శశిధరరెడ్డి, మోరా వెంకటరెడ్డి, ఎన్ శివశంకర్రెడ్డి, ఎన్ సురేష్రెడ్డి, బొమ్మారెడ్డి శ్రీనివా సరెడ్డి, దేవిరెడ్డి సోమిరెడ్డి, కొల్లి చలమారెడ్డి, కల కోటి శ్రీనివాసరెడ్డి, వల్లభనేని బుల్లిబాబు, చిగురు పాటి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.