ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. పెళ్లి బస్సు రాంపురా నుంచి తిరిగి వస్తుండగా గోపాల్‌పుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఐదుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa