పది పరీక్షల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. గుంటూరుకు చెందిన అనఘాలక్ష్మి (11) బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. తల్లి ప్రోత్సాహంతో అనఘా.. అబాకస్, వేదగణితంలో ప్రతిభ సాధించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ సూచనతో తల్లిదండ్రులు బాలిక పది పరీక్షలకు అనుమతి తీసుకున్నారు. ఫలితాల్లో 566 మార్కులు సాధించి అబ్బురపరిచింది అనఘా.