మణిపూర్ లో చిక్కుకున్న 157 మంది ఏపీ విద్యార్థులను నేడు ప్రభుత్వం స్వస్థలాలకు తీసుకురానుంది. దీనికోసం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. నేడు ఉదయం ఇంఫాల్ నుండి హైదరాబాద్ కు ఓ విమానం చేరుకోనుంది. దీనిలో 108 మంది విద్యార్థులు రానున్నారు. అలాగే 49 మంది విద్యార్థులతో మరో విమానం ఇంఫాల్ నుండి కోల్ కతా చేరుకోనుంది. అక్కడి నుండి విద్యార్థులను స్వస్థలలాకు తరలించనున్నారు.